Appi Reddy: రైతులకు మద్దతుగా ఉద్యమం..! 10 d ago

AP : రైతులు అయోమయం పరిస్థితిలో ఉన్నారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రైతు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని విమర్శించారు. రైతులు ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు కన్నీరు పెడ్డితే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే.. ఈ ప్రభుత్వంలో రూ.300 కోట్లతో అన్ని పంటలకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని మండిపడ్డారు.
ఈ ప్రభుత్వంలో రైతులను ఆదుకోవడం లేదని, రైతుల వద్ద ఉన్న సరుకు వ్యాపారుల వద్దకు వెళ్లిన తరువాత ఆలోచన చేస్తారా అని ప్రశ్నించారు. వ్యాపారస్తుల ప్రయోజనాలను కాపాడుతూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇదేనా రైతులపై ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతులకు మద్దతు ధర కల్పించి అండగా నిలవాలని, లేదంటే రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయం దండగా అని కూటమి నాయకులు భావిస్తున్నారా అని ప్రశ్నించారు.